ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ సినిమాపై స్పందించింది ఇలియానా. ఈ సినిమా నుంచి “దావుదీ” సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ వేసిన డాన్స్ ను ప్రత్యేకంగా మెచ్చుకుంది. ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం చాలా కష్టమని, అతడి ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవ్వరివల్ల కాదని చెప్పుకొచ్చింది.
అదే టైమ్ లో జాన్వి కపూర్ పై ప్రత్యేక ప్రశంసలు కురిపించింది.
ఎన్టీఆర్ తో సమానంగా జాన్వి కపూర్ డాన్స్ చేసిందని, ఈ విషయంలో జాన్విని ప్రత్యేకంగా అభినందించాలంటూ మెచ్చుకుంది. దేవర-1 టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది గోవా బ్యూటీ.
ఎన్టీఆర్ తో “రాఖీ”, “శక్తి” సినిమాలు చేసింది ఇలియానా. ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం చాలా కష్టమని ఆ టైమ్ లోనే చెప్పింది. తన గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు “దేవర-1” సాంగ్ పై స్పందించింది.
ఓ తెలుగు సినిమాపై ఇలియానా స్పందించడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. ఆమె టాలీవుడ్ అప్ డేట్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతుందనే విషయం తాజా పోస్టుతో చాలామందికి తెలిసొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికాలో ఉంటుంది. పూర్తిగా కుటుంబ జీవితానికి అంకితమైంది.