విజయ్ దేవరకొండ ఇటీవల మూడు సినిమాలు ప్రకటించాడు. అందులో ఒక సినిమా ఇప్పటికే సగ భాగం పూర్తి చేసుకొంది. తాజాగా మరో రెండు సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి.
విజయ్ దేవరకొండ నటిస్తోన్న “VD 12” చిత్రం ఈ వీకెండ్ శ్రీలంకలో షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం మరో రెండు నెలల్లో పూర్తి అవుతుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మేకోవర్ చేసుకొని “VD 14” సినిమా షురూ చేస్తాడు.
ఇప్పటికే “VD 14” సినిమాకి సంబంధించి పాత్రల కోసం దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ రాయలసీమలో ఆడిషన్ లు చేస్తున్నాడు. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంగా సాగుతుంది. “టాక్సీవాలా”, “శ్యామ్ సింగ రాయ్” చిత్రాల తర్వాత రాహుల్ తీస్తున్న మూవీ ఇది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.