
వేణుస్వామిపై 2 జర్నలిస్టు సంఘాలు కలిసి, సంయుక్తంగా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అడిగినా, అడగకపోయినా సెలబ్రిటీల జాతకాలు చెబుతున్నాడని, మానసిక వేదనకు గురిచేస్తున్నాడని అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో మహిళా కమిషన్, వేణు స్వామికి నోటీసులిచ్చింది.
ఈ సమన్లు పనిచేసినట్టున్నాయి. వేణు స్వామి స్వరం మారింది. ఇన్నేళ్లలో తొలిసారి అతడు సమంతకు సారీ చెప్పాడు. కొంతమంది పనిగట్టుకొని, అదే పనిగా తనతో సమంత జాతకం చెప్పించారని.. బహిరంగంగా ఆమె జాతకం చెప్పి నొప్పించానని అంటూనే.. అందరి తరఫున సమంతను క్షమాపణలు కోరుతున్నానంటూ వీడియో రిలీజ్ చేశాడు.
ఈ దశలో సమంతకు ధైర్యం చెప్పడం తప్ప తను చేసేదేం లేదని చేతులు దులుపుకున్నాడు వేణుస్వామి. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం చేసుకున్నప్పుడు సమంతపై జనాల్లో సింపతీ రాకుండా ఉండేందుకు, కొంతమంది తనతో మరోసారి జాతకం చెప్పించారని, అలా సమంతను లైమ్ లైట్లో లేకుండా చేశారని ఆరోపిస్తున్నాడు వేణుస్వామి.
ఇన్నేళ్లు సమంత అనుభవించిన మనోవేదనే, మయొసైటిస్ రూపంలో ఆమెను బాధపెట్టిందని.. అయితే సమంత కెరీర్ చాలా బాగుందని, ఆమె సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతుందని అన్నాడు.