
తెలుగు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షో ప్రారంభం కాకముందే కంటెస్టెంట్స్ పేర్లు చాలా బయటకొస్తున్నాయి. అందులో మెజారిటీ పేర్లు నిజం. తాజాగా మరో పేరు తెరపైకొచ్చింది. ఆమె పేరు జ్యోతి పూర్వాజ్ అలియాస్ జ్యోతి రాయ్.
“గుప్పెడంత మనసు” సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జ్యోతి రాయ్.
బుల్లితెరపై ఆమె సంప్రదాయబద్ధంగా కనిపించినప్పటికీ, ఆమె సోషల్ మీడియా ఎకౌంట్ చూస్తే అసలు విషయం అర్థమౌతుంది.
హాట్ హాట్ గా కనిపించడం జ్యోతి స్పెషల్. టైమ్ దొరికితే చాలు ఫొటోషూట్స్, రీల్స్ చేస్తూ బిజీగా గడిపేస్తుంది. ఇప్పుడు ముద్దుగుమ్మ బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
బిగ్ బాస్ హౌజ్ లోకి ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. వీళ్లకు జ్యోతి కూడా కలిసిందంటే, హౌజ్ లో రచ్చ రంబోళానే.

అన్నట్టు స్వాతి నాయుడు, సోనియా సింగ్ పేర్లు కూడా దాదాపు లాక్ అయ్యాయి. చూస్తుంటే.. ఈసారి సీజన్-8 మరింత స్పైసీగా ఉండబోతోంది. అందుకేనేమో.. “ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు” అంటూ క్యాప్షన్ పెట్టారు.