“తండేల్” సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుందా? లేక వాయిదా పడుతుందా? ఇది నాగ చైతన్య ఫ్యాన్స్ కి ఉన్న డౌట్.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు చందూ మొండేటి “తండేల్” పేరుతో ఒక భారీ చిత్రం తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. డిసెంబర్ 20, 2024న విడుదల చేస్తామని ఇంతకుముందు నిర్మాతలు ప్రకటించారు. ఐతే, ఇప్పుడు పరిస్థితి మారింది. క్రిస్మస్ కి “గేమ్ ఛేంజర్” ని విడుదల చేస్తామని ఇటీవలే నిర్మాత దిల్ రాజు అనౌన్స్ చేశారు. దాంతో, “తండేల్” విడుదల డౌట్ లో పడింది.
ఈ విషయం గురించి “తండేల్” నిర్మాత బన్నీ వాసు తాజాగా క్లారిటీ ఇచ్చారు.
“డిసెంబర్‌లో రిలీజ్ చెయ్యాలని ఇంతకుముందు అనుకున్నాం. అయితే అదే నెలలో “పుష్ప 2″, అలాగే ” గేమ్ చేంజర్” రిలీజ్‌కానున్నాయి. మేం ఇంతకుముందు “తండేల్” డేట్ ప్రకటించినప్పుడు పుష్ప 2, గేమ్ ఛేంజర్ లైన్లో లేవు. అలాగే మా సినిమాకు సంబంధించి సీజీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. అవన్నీ చూసుకునే దసరా తర్వాతే తండేల్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తాం,” అని ఆయన చెప్పారు.