
ఈమధ్య సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేశాడు తమన్. ప్రభాస్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటి ఎంతోమంది హీరోల అప్ డేట్స్ కొద్దికొద్దిగా అందించాడు. ఈ క్రమంలో ఓజీ అప్ డేట్ కూడా ఇచ్చాడు.
దర్శకుడు సుజీత్ తో కలిసి ఓ వర్క్ చేస్తున్నామని, త్వరలోనే దాన్ని అందరూ చూస్తారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడా వర్క్ పూర్తయింది. చాలామంది దీన్ని ఓజీ టీజర్ అనుకుంటున్నారు. కానీ అది ఓజీ టీజర్ కాదు. ఓజీ సినిమాకు సంబంధించి ఓ చిన్న షోరీల్ లాంటిది. పవన్ పుట్టినరోజు కానుకగా, ఒక రోజు ముందు ఈ వీడియోను విడుదల చేయబోతున్నారు.
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఓజీ సినిమా. పవన్ మరో 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సినిమా పూర్తవుతుందని యూనిట్ చెబుతోంది.
అయితే పవన్ మాత్రం ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టడం లేదు. ఈ నెలాఖరు నుంచి ఆయన సెట్స్ పైకి వస్తాడనే ప్రచారం జరిగినప్పటికీ అలాంటి సంకేతాలేం కనిపించడం లేదు.