
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ భార్యాభర్తలుగా కలిసి ఉన్నారా, విడిపోయారా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం. అటు అభిమానులకు, ఇటు మీడియాకి అర్థం అయి, అర్థం కానీ విషయం ఇది. వారి బంధం గురించి ఎన్నో పుకార్లు, ఎన్నో ప్రచారాలు. అయినా, అసలు అలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అని కోపంతో కసురుకోవడం లేదు ఐశ్వర్య. అలాగనీ, విడిపోయినట్లు చెప్పడం లేదు. అందుకే, ఒక మిస్టరీగా మారింది ఈ మొత్తం వ్యవహారం.
దానికి తోడు, ఇటీవల అంబానీ ఇంట పెళ్ళికి అభిషేక్ బచ్చన్ తన తల్లితండ్రులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ తో పాటు తన సోదరి, ఆమె పిల్లలతో కలిసి వచ్చాడు. కలిసి వెళ్ళాడు. మరోవైపు, ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి పెళ్ళికి వచ్చింది. బచ్చన్ కుటుంబానికి సంబంధం లేదన్నట్లుగా విడిగా విచ్చేసింది.
దాంతో, చాన్నాళ్లుగా సాగుతున్న ఐశ్వర్య, అభిషేక్ విడాకుల ప్రచారానికి బలం చేకూరినట్లయింది. మీడియా అంతా వారు విడిపోయిన మాట నిజమే అని రాసింది.