
కొన్ని సినిమాలు భారీ అంచనాలతో తెరకెక్కుతుంటాయి. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమౌతాయి. దీనికి ఉదాహరణలుగా ఎన్నో సినిమాల్ని చెప్పుకోవచ్చు. అలాంటిదే కస్టడీ సినిమా కూడా.
కోలీవుడ్ డైరక్టర్ వెంకట్ ప్రభుతో నాగచైతన్య కస్టడీ అనే సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. తాజాగా దీనిపై దర్శకుడు స్పందించాడు. తన ఐడియాను మార్చేయడం వల్లనే సినిమా ఫ్లాప్ అయిందంటూ పరోక్షంగా వెల్లడించాడు.
నాగచైతన్యతో తీసిన “కస్టడీ”, సూర్యతో తీసిన “మాస్” లాంటి సినిమాలకు తను అనుకున్న ఐడియాను హీరో లేదా నిర్మాత వల్ల మార్చాల్సి వచ్చిందన్నాడు వెంకట్ ప్రభు. అలా మార్చడం వల్ల ఆ సినిమాలు సరిగ్గా ఆడలేదు అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు.
ఇక మంగత, మానాడు, చెన్నై 28 లాంటి సినిమాల విషయానికొస్తే, తను అనుకున్న ఐడియాను ఏమాత్రం మార్పుచేర్పులు చేయకుండా తీశానని అందుకే అవి హిట్టయ్యాయని అన్నాడు. తాజాగా ఈ దర్శకుడు విజయ్ తో ‘గోట్’ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఐడియా కూడా మార్చలేదన్నాడు. విజయ్ తనకు ఎలాంటి మార్పులు సూచించలేదని చెబుతున్నాడు.
కానీ ఈ రోజు విడుదలైన సినిమా చూస్తే నిర్మాత మార్చమని అడిగినా, అడగకపోయినా ఈయన తీసే సినిమాల్లో కొన్నే వర్కవుట్ అర్థం అవుతోంది. ఈ సినిమాకి విమర్శకులు అందరూ తక్కువ రేటింగ్ ఇచ్చారు. “గోట్” పేరుతో ప్రేక్షకులను బక్రా చేశాడని అంటున్నారు.