వినాయక చవితి వస్తోంది. రకరకాల గెటప్స్ లో గణపతి కొలువుదీరడం మనం ఇదివరకే చూశాం. క్రికెట్ ఫీవర్, బ్లాక్ బస్టర్ సినిమా, పర్యావరణ పరిరక్షణ… ఇలా ఎన్నో థీమ్స్ లో గణపతి కొలువుదీరిన మంటపాలు చూశాం.
ఈ ఏడాది కూడా ఊరూవాడా గణపతులు కొలువుదీరబోతున్నాయి. రకరకాల థీమ్స్ కూడా ప్లాన్ చేశారు. మరో వారం రోజుల్లో అవన్నీ మీడియాలో కనిపించబోతున్నాయి. అయితే అంతకంటే ముందే “పుష్ప-2” థీమ్ తో వెలిసిన గణపతి ఫొటో ఒకటి బయటకొచ్చింది. కాకపోతే ఇది తీవ్ర అభ్యంతరకరంగా ఉంది.
గతేడాది పుష్ప థీమ్ తో గణపతి కొలువుదీరింది. అంతా దాన్ని ఎంజాయ్ చేశారు కూడా. కానీ ఈసారి పుష్ప-2లోని ‘సూసేకి’ అనే సాంగ్ లోని డాన్స్ ఆధారంగా వినాయక ప్రతిమను డిజైన్ చేస్తున్నారు. ముందు ఓ అమ్మాయి బొమ్మను, వెనక వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారు.
దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లూ చాలా రకాల గణపతులు చూశాం కానీ, ఇది మాత్రం అభ్యంతరకరంగానే ఉంది. కొలువుదీరిన తర్వాత కచ్చితంగా దీనిపై విమర్శలు రావడం గ్యారెంటీ.