Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

విజయ్ సినిమాపై డౌట్స్

Cinema Desk, September 24, 2024September 24, 2024

హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్, సెట్స్ పైకి వచ్చాడు. ఈ సినిమా కోసం బెజవాడలో సెట్ వేశారు. పనిలోపనిగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి 28న హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఓ పెద్ద సినిమా విడుదల చేస్తే, ఆ ప్రభావం ఇతర సినిమాలపై కచ్చితంగా పడుతుంది. పవన్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఓ సినిమాపై పడింది. అదే విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 28న ఈ సినిమాను విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు.

కట్ చేస్తే, ఇప్పుడు అదే తేదీకి పవన్ సినిమాను షెడ్యూల్ చేశారు. సమ్మర్‌కి ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి విజయ్ దేవరకొండ సినిమాను వాయిదా వేయడం సాధ్యం కాదు. అలా అని ప్రీ-పోన్ చేయడం కూడా సాధ్యం కాదు. అలా చేస్తే వేసవి శెలవుల అడ్వాంటేజ్ కోల్పోతుంది విజయ్ సినిమా.

విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా టైటిల్ ఎనౌన్స్ చేయలేదు. త్వరలోనే టైటిల్ ఎనౌన్స్ చేస్తామని స్వయంగా విజయ్ దేవరకొండ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. 

న్యూస్

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Komalee Prasad
    యాక్టర్ అయి తిరిగి డాక్టర్ గా!
  • Keerthy Suresh
    కీర్తికి పెళ్లయిందని చాలా బాధపడ్డా!
  • Nithya Menen
    ప్రభాస్ ఇప్పటికీ బాధపెడుతున్నాడు!
  • Chiru Anil
    చిరు కామెడీ నెక్ట్స్ లెవెల్
  • Varsha Bollamma
    కిక్ బాక్సింగ్ నేర్చిన హీరోయిన్
  • Aamir Khan
    ‘కూలి’లో దహాగా అమీర్‌ఖాన్‌
  • Shruti Haasan
    శృతిహాసన్ తో అందుకే సెట్ కాలేదు
  • Megastar Chiranjeevi
    విశ్వంభరలో 4676 VFX షాట్స్
  • Allu Arjun
    కిర్రాక్ కాంబినేషన్
  • Ram Charan
    ఫ్యాన్స్ గుస్సా… ట్రబుల్లో రాజు
  • Sapthami Gowda
    నాకు అలాంటివి ఇష్టమే: సప్తమి గౌడ
  • Thammudu
    తమ్ముడు టైటిల్ వద్దన్న నితిన్
  • Megastar and Bulliraju
    మెగాస్టార్ తో బుల్లిరాజు
  • Raashi Khanna
    పుకారు నిజమైతే సూపర్!
  • Naga Chaitanya and Sobhita
    వీరి లెక్కలు, వంతులు వేరు

ఇతర న్యూస్

  • యాక్టర్ అయి తిరిగి డాక్టర్ గా!
  • కీర్తికి పెళ్లయిందని చాలా బాధపడ్డా!
  • అనుదీప్ ను నెట్టేసిన పోలీసులు
  • ప్రభాస్ ఇప్పటికీ బాధపెడుతున్నాడు!
  • చిరు కామెడీ నెక్ట్స్ లెవెల్
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us