సుధీర్ బాబు “జటాధర” అనే సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందు నుంచే ఈ సినిమా ప్రచారం మొదలుపెట్టాడు ఈ హీరో. ఇప్పటికే ఓ పోస్టర్ రిలీజ్ చేయగా, తాజాగా మరో పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో, శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం “జటాధర” సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్ ఇండియా లెవల్లో వచ్చే ఏడాది శివరాత్రికి సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై రాబోతున్న జటాధర సినిమాలో ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. అలాగే ఓ బాలీవుడ్ నటుడ్ని విలన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.