“దేవర” సినిమా సెట్స్ పైకి వచ్చి, కొన్ని రోజుల షూటింగ్ కూడా పూర్తయిన తర్వాత రెండు భాగాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొరటాల శివ ఈ విషయాన్ని ప్రకటించాడు.
అసలు సినిమాను 2 భాగాలుగా చేయాలనే నిర్ణయం వెనక ఏం జరిగిందనేది బయటపెట్టాడు.
“కథ రాసుకుంటూ వెళ్లాం. పాత్రలు అద్భుతంగా వచ్చాయి, సన్నివేశాలు చాలా చక్కగా వచ్చాయి. నిడివి కాస్త ఎక్కువ అవుతుందని తెలిసి మరీ షూటింగ్ కు వెళ్లాం. అవసరమైతే 3 గంటల సినిమాగా విడుదల చేయాలనేది ప్లాన్. అయితే ఎప్పుడైతే మేం షూట్ చేసిన రష్, ఎడిటింగ్ పని మొదలైందో, అప్పుడు ఎడిటర్ నుంచి కాల్ వచ్చింది. సర్.. ఈ రష్ మొత్తాన్ని ఎడిట్ చేసి మీరు అనుకున్న లెంగ్త్ లో కట్ చేయడం చాలా కష్టం. మంచి ఫుటేజ్ పోతోంది, 2 భాగాలు చేయడం మంచిదని అన్నారు. అప్పుడే మాకు ఆలోచన వచ్చింది.”
ఇలా దేవర రెండు భాగాలుగా మారిన విధానాన్ని బయటపెట్టాడు కొరటాల శివ.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “దేవర” ఫీవర్ నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కటౌట్లకు రక్తాభిషేకాలు చేస్తున్నారు. అటు ఓవర్సీస్ లోఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 2 మిలియన్ డాలర్లు దాటేసింది.