తన వాళ్ల కోసం ప్రభాస్ ఎలా నిలబడతాడనే విషయానికి ఇదో మంచి ఉదాహరణ. వరుస షూటింగ్స్ తో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైమ్ లో కూడా ట్రయిలర్ లాంచ్ కోసం అడిగితే కాదనలేకపోయాడు. వెంటనే ఒప్పుకున్నాడు. నిజానికి ట్రయిలర్ లాంచ్ పెద్ద సమస్య కాదు. ల్యాప్ టాప్ ఓపెన్ చేసి, ట్రయిలర్ చూసి, బాగుందని ఓ బైట్ ఇస్తే సరిపోతుంది.
దీని కోసం పెద్ద టైమ్ కేటాయించక్కర్లేదు. కానీ ప్రభాస్ అలా చేయలేదు. ట్రయిలర్ లాంచ్ కోసం ఓ స్కిట్ చేశాడు. అందులో నటించాడు. దాని కోసం టైమ్ కేటాయించాడు. అలా అర్థరాత్రి 12 గంటల వరకు, కేవలం ట్రయిలర్ లాంచ్ కోసం షూటింగ్ చేశాడు ప్రభాస్. ఇదంతా “మత్తువదలరా 2” ట్రయిలర్ లాంచ్ సంగతి.
ఈ సినిమా ట్రయిలర్ ను ప్రభాస్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభాస్, సత్య, ఫరియా, శ్రీసింహా మధ్య ఓ స్కిట్ ప్లాన్ చేశారు. దాని కోసం అర్థరాత్రి 12 వరకు వర్క్ చేశాడట. ఈ విషయాన్ని మత్తువదలరా 2 నిర్మాత చెర్రీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ప్రభాస్ కు ధన్యవాదాలు తెలిపాడు.
మత్తు వదలరా 2 సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో నడుస్తోంది. మరో 3 రోజుల పాటు ఈ సినిమా రన్ కొనసాగుతుంది. ఆ తర్వాత దేవర సినిమా వస్తోంది. దేవర రిలీజ్ తర్వాత ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యే అవకాశం ఉంది.