లడ్డూ కావాలా నాయనా అనేది ఫేమస్ డైలాగ్. కొన్ని ‘ప్రత్యేక’ సందర్భాల్లో ఈ డైలాగ్ చాలా పాపులర్. కార్తి హీరోగా నటించిన “సత్యం సుందరం” సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఈ డైలాగ్ వాడారు. దీని చుట్టూ చిన్న క్వశ్చన్ ప్లాన్ చేశారు. కానీ కార్తి మాత్రం సుతారంగా నో చెప్పాడు.
“ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్. నాకు లడ్డూ వద్దు.” అంటూ స్పందించాడు కార్తి. సరదాగా స్పందించమని యాంకర్ కోరగా.. అస్సలు లడ్డూ వద్దు అంటూ కరాఖండిగా చెప్పేశాడు.
ప్రస్తుతం తిరుమల లడ్డూ చుట్టూ భయంకరమైన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, సౌత్ స్టేట్స్ అనే తేడా లేకుండా అందరూ తిరుమల లడ్డూపై స్పందిస్తున్నారు. ఏకంగా కేంద్రం కూడా ఈ వివాదంపై దృష్టి పెట్టింది. దీంతో లడ్డూ ఇష్యూ ఇప్పుడు జాతీయ అంశంగా మారింది.
ఇలాంటి సెన్సిటివ్ టైమ్ లో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్న అడగడంతో కార్తి స్పందించడానికి తిరస్కరించాడు. చూస్తుంటే, కార్తి కరెంట్ ఎఫైర్స్ బాగానే ఫాలో అవుతున్నారు.