విజయ్ దేవరకొండ స్టార్ గా స్థిరపడ్డాడు కానీ ఇటీవల సరైన విజయాలు లేక కొంచెం డీలాపడ్డాడు. ఇకపై కథలపై ఫోకస్ పెట్టి సినిమాలు చెయ్యాలనే ఉద్దేశంతో కొత్త తరహా చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకులతో చేతులు కలిపాడు. వరుసగా మూడు సినిమాలు అలాంటివే. అందులో మొదటగా వస్తున్న మూవీ … ‘VD12’ (విజయ్ దేవరకొండ 12వ చిత్రం).
‘మళ్ళీరావా’, ‘జెర్సీ’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఇంకా పేరు పెట్టలేదు. కానీ ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చెయ్యనున్నారు. ఈ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది టీం. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇలా పూర్తిగా కొత్త లుక్ లో కనపడనున్నాడు దేవరకొండ.
ALSO READ: ‘VD12’ has officially announced its release date
సితార సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాకి టైటిల్ ఏమి పెడుతారో చూడాలి. ఆగస్టు 15న ఆ టైటిల్ ని ప్రకటిస్తారట.
శ్రీలంకకు వలస వెళ్లిన ఒక తెగ నేపథ్యంగా ఈ సినిమా కథ జరుగుతుంది. ఈ కథని ప్రతిబింబించే టైటిల్ పెడతారట.