వరుసగా ఫ్లాపులిస్తూ వస్తున్నాడు వరుణ్ తేజ్. అతడు నటించిన తాజా చిత్రం ‘మట్కా’, థియేటర్లలో నిలబడలేకపోయింది. అంతకంటే ముందొచ్చిన ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘గాండీవధారి అర్జున’, ‘గని’ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.
దీంతో వరుణ్ తేజ్ డైలమాలో పడ్డాడని అంతా అనుకున్నారు. కానీ అతడు తన పంథా మార్చుకోలేదు. కొత్తగా ఉండే కథల్ని ఎంచుకోవడం, ప్రయోగాలు చేయడానికే అతడు మొగ్గుచూపుతున్నాడు. ఇందులో భాగంగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. దీనికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పెట్టారంట. హీరోయిన్ గా రితికా నాయక్ ను తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం భార్యతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న వరుణ్ తేజ్, తిరిగొచ్చిన వెంటనే ఈ ప్రాజక్టుపై క్లారిటీ వస్తుంది.