వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ చేతులు కలిపారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కలిపి ఈ సినిమాని తీస్తున్నాయి. గతంలో వరుణ్ తేజ్ తో “కంచె” సినిమా తీసింది ఫస్ట్ ఫ్రేమ్ సంస్థ. యువి క్రియేషన్స్ ఈ సంస్థతో చేతులు కలపడం విశేషం.
మేర్లపాక గాంధీ ఇంతకుముందు ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘ఏకె మినీ కథ’ వంటి సినిమాలు తీశారు. ఇప్పుడు వరుణ్ తేజ్‌ని కొత్త రోల్ లో చూపించబోతున్నారట.
వరుణ్ తేజ్ కి ఇటీవల హిట్స్ లేవు. వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో, ఆయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు జంకుతున్నారు అని టాక్ నడుస్తోంది. కానీ ఈ సినిమా ప్రకటన రావడంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలింది.
ALSO READ: Varun Tej goes on a long vacation
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మార్చి 2025లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.