డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు హీరోహీరోయిన్లంతా విదేశాలకు క్యూ కడతారు. ఎంచక్కా ఓ వారం రోజుల పాటు ఫుల్ గా ఎంజాయ్ చేసి, తిరిగి పనిలో పడిపోయారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 31ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి హీరోలు రెడీ అయ్యారు.
ఎన్టీఆర్ లండన్ వెళ్లాడు. కుటుంబంతో కలిసి లండన్ లోని ఎమ్యూజ్ మెంట్ పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి లండన్ వీధుల్లో షికారు చేస్తున్న ఎన్టీఆర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. అయితే 31 రాత్రికి అతడు మరో దేశంలో ల్యాండ్ అయ్యే అవకాశాలున్నాయి.
అటు నాగచైతన్య, తన భార్య శోభితతో కలిసి న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రిపేర్ అవుతున్నాడు.
ఇక ఈ ఏడాది వేడుకలు మిస్సైన వాళ్లు కూడా ఉన్నారు. కోర్టు కేసు, పోలీసు విచారణ కారణంగా అల్లు అర్జున్ ఇంటికే పరిమితం కాగా… కాలి గాయం కారణంగా ప్రభాస్ కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఇక రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ ప్రమోషన్ తో బిజీగా ఉన్నాడు.
హీరోయిన్లలో రకుల్ లండన్ లో ల్యాండ్ అవ్వగా.. మరో హీరోయిన్ శ్రీలీల, హైదరాబాద్ లోని నోవాటెల్ ఈవెంట్ లో సందడి చేయబోతోంది.