రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక రివ్యూ వచ్చేసింది. దర్శకుడు సుకుమార్, ‘గేమ్ ఛేంజర్’ ఎలా ఉంటుందో చెప్పేశాడు.
అమెరికాలోని డాలస్ లో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన సుక్కూ, సినిమా గురించి మాట్లాడాడు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ అయితే బ్లాక్‌బస్టర్ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సూపర్ అని మెచ్చుకున్నాడు. క్లైమాక్స్‌లో రామ్ చరణ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కు జాతీయ అవార్డు గ్యారెంటీ అన్నాడు.
ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ కు సంబంధించి మరో రివ్యూ బయటకొచ్చింది. ఈసారి సినిమాపై చిరంజీవి రివ్యూ ఇచ్చారు. విజయవాడలో ఏర్పాటుచేసిన భారీ రామ్ చరణ్ కటౌట్ ను నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించే పనిలో ఉంటుంటే, ఇటు హైదరాబాద్ లో చిరంజీవి ‘గేమ్ ఛేంజర్’ సినిమా చూశారు.
సినిమా చూసిన వెంటనే దిల్ రాజుకు ఫోన్ చేశారు. ఆ టైమ్ లో దిల్ రాజు, బెజవాడలో మెగాభిమానుల మధ్య ఉన్నారు. సినిమా చూసిన చిరంజీవి, ఈ సంక్రాంతి మామూలుగా ఉండదని అన్నారట. చిరంజీవి ఒక్కో సీన్ గురించి చెబుతూ, చాలా ఆనందం వ్యక్తం చేశారంట. దర్శకుడు శంకర్ నాలుగేళ్ల కిందట కథ చెబుతున్నప్పుడు ఎలా ఫీలయ్యానో, చిరంజీవి రివ్యూ ఇస్తున్నప్పుడు అంతే ఫీలయ్యానని అంటున్నాడు దిల్ రాజు.