హీరోయిన్లతో ఐటెం సాంగ్స్ చేయించడం అనేది బాలీవుడ్ లో మొదలైంది. దాన్ని టాలీవుడ్ ఇంకా ముందుకు తీసుకెళ్లింది. చాలా ఏళ్లుగా మన దర్శక నిర్మాతలు పేరున్న హీరోయిన్లతో తమ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయిస్తున్నారు. 2024లో ఇప్పటికే శ్రీలీల, అయేషా ఖాన్, కేతిక శర్మ వంటి భామలు ఐటెం సాంగ్స్ చేశారు.
ఇప్పుడు ఈ జాబితాలోకి రెబ మోనికా జాన్ వచ్చింది. “మ్యాడ్” సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న “మ్యాడ్ స్క్వేర్”లో ఆమె “స్వాతి రెడ్డి” అనే ఐటెం సాంగ్ లో కనిపించింది. ఆ పాట ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ పాటలో రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రెబా కెరీర్ లో ఇదే మొదటి ఐటెం సాంగ్. ఈ ఏడాది (2024)లో ఇలా మొదటి సారిగా ఐటెం గర్ల్స్ గా మారిన భామలు మరో ముగ్గురు ఉన్నారు.
ఈ ఏడాది “పుష్ప 2” సినిమాతో ఐటెంసాంగ్ లోకి వచ్చింది శ్రీలీల. “కిస్సిక్” అనే పాటకు ఆమె అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేసింది. తెలుగులో ఆ పాట పెద్దగా క్లిక్ కాలేదు కానీ హిందీ ప్రేక్షకులకు బాగా పట్టింది.
ఇక పలు సినిమాల్లో చిన్న చిన్న గ్లామర్ పాత్రలు పోషించిన అయేషా ఖాన్ ఈ ఏడాది తెలుగులో ఐటెం గాళ్ గా మారింది. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే చిత్రంలో కనిపించింది.
ఈ ఏడాది ఐటెం గాళ్ గా రూపాంతరం చెందిన ఇంకో హీరోయిన్… కేతిక శర్మ. ఆమె నితిన్ హీరోగా నటించిన “రాబిన్ హుడ్” అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా క్రిస్మస్ 2024కే విడుదల కావాలి. కానీ చివరి నిమిషంలో వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
మొత్తంగా శ్రీలీల, రెబా, అయేషా ఖాన్, కేతిక శర్మ 2024లో ఐటెం గర్ల్స్ గా పరిచయం అయ్యారు.