
ఈ రోజు అందాల తార జాన్వీ కపూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో నటిస్తోన్న రెండో చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ విడుదలైంది. జాన్వీ కపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఆమె స్టిల్‌ను రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాలో ఆమె ఇలాగే కనిపిస్తుందని, ఇది ఆమె ఈ సినిమా మొదటి లుక్ అని ప్రచారం జరిగింది. కానీ ఇది సినిమాలోని ఫోటో కాదంట.
ఇటీవల ఆమె ఈ సినిమా కోసం మైసూర్ లో ఆమె షూటింగ్ లో పాల్గొన్నప్పుడు సెట్ అవతల తీసిన ఫోటో ఇది. ఇది మొదటి లుక్ కాదు. మొదటి లుక్ ని మరో సందర్భంలో అధికారికంగా విడుదల చేస్తామని టీం క్లారిటీ ఇచ్చింది
ఈ సినిమాలో (RC16) ఆమె రామ్ చరణ్‌తో కలిసి నటిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు.
తెలుగు సినిమా రంగంలోకి జాన్వీ కపూర్ ‘దేవర’ చిత్రంతో అడుగుపెట్టింది. ఇప్పుడు రామ్ చరణ్ తో నటిస్తోంది. త్వరలోనే అట్లీ తీసే కొత్త చిత్రంలో ఆమె అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం ఉంది.