
తమన్న, విజయ్ వర్మ విడిపోయారు. పెళ్లి వరకు వచ్చిన వారి ప్రేమాయణం ఇలా బ్రేకప్ గా ఎండ్ కావడానికి కారణం ఉంది.
ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా భావించింది. అందుకే, అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వస్తోంది. ఐతే, విజయ్ వర్మ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయట. పెళ్ళికి ఇంకా టైం కావాలని, రెండేళ్ల తర్వాత చేసుకుందామని విజయ్ వర్మ పట్టుపట్టాడట. దాంతో, విభేదాలు మొదలై బ్రేకప్ చెప్పుకున్నారట.
35 ఏళ్ల తమన్న పెళ్లి విషయంలో పర్టిక్యులర్ గా ఉంది. తమన్న గతంలో డేటింగ్ చేసినా అవి పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ అని అందరికీ పరిచయం చేసింది ఒక్క విజయ్ వర్మనే.
ALSO READ: Post-breakup, Tamannaah Bhatia shifts focus on her career
ఎయిర్పోర్ట్ వద్ద ఫోటోలు, వీడియోలు తీసే పాపారాజి పెళ్లి స్వీట్లు ఎప్పుడు పంచుతున్నావు అని ఎప్పుడు అడిగినా నవ్వుతూ త్వరలోనే అంటూ సిగ్నల్ ఇచ్చేది. కానీ ఇలా బ్రేకప్ అయిపొయింది.
తమన్న ప్రస్తుతం తెలుగులో “ఓదెల 2” అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది.