
మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే తెలుగులో ప్రభాస్ తో కలిసి నటించాడు. “సలార్” సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు రెండో చిత్రంగా రాజమౌళి తీస్తున్న భారీ చిత్రాన్ని ఒప్పుకున్నాడు.
ఈ రోజు నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ప్రస్తుతం షూటింగ్ మొదలైంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లపై రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ పూర్తిగా తెలుగులో డైలాగులు చెప్పబోతున్నాడు. అతను విలన్ గా కనిపిస్తాడు అని టాక్. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా నటిస్తోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో క్రేజున్న స్టార్. ఇటీవల మోహన్ లాల్ హీరోగా “ఎల్ 2” అనే సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. అది కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.