
బంగారం అక్రమ రవాణా కేసులో ఒక హీరోయిన్ పట్టుబడడం సంచలనం సృష్టించింది. కన్నడ నటి రన్యా రావ్ బంగారం స్మగ్గ్లింగ్ చేస్తూ దొరికిన విషయం తెలిసిందే. ఒక హీరోయిన్ ఇలాంటి పనులు చేస్తుందని ఎవరూ ఉహించలేదు. పైగా ఆమె తండ్రి కర్ణాటక పోలీసు ఉన్నతాధికారి.
ఆమె డబ్బులు బాగా వస్తాయనే ఉద్దేశంతోనే ఈ పనులు మొదలుపెట్టింది. తన తండ్రి (ఆమె తల్లి అతన్ని రెండో పెళ్లి చేసుకొంది) డిజిపి కాబట్టి కస్టమ్ చెకింగ్ లు సులువుగా తప్పించుకునేది. ఐతే, కస్టమ్ అధికారులకు ఈవిడ దుబాయ్ ట్రిప్పులపై అనుమానం వచ్చింది. ఒక హీరోయిన్ నెలలో అన్ని సార్లు ఎందుకు దుబాయ్ వెళ్లి వస్తోంది అనే అనుమానంతో నిఘా పెట్టారు.
కిలోకి 12 లక్షలు
మన దేశంలో చాలా బంగారం కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా కొనే బంగారం తక్కువ. దుబాయ్ నుంచి తక్కువ ధరకు దొరికే బంగారాన్ని స్మగ్లర్ల ద్వారా కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కేరళ ఈ స్మగ్లింగ్ ఎక్కువ అనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ స్మగ్లర్లు రన్యారావ్ ని పట్టుకున్నారు. మీ తండ్రి పేరుని ఉపయోగించుకొని కస్టమ్ అధికారుల తనిఖీలు తప్పించుకోవచ్చని చెప్పారు. కిలో బంగారం తెస్తే 5 లక్షల రూపాయల కమీషన్ ఇచ్చేవారట.
కమీషన్‌తో పాటు ఇతర ఖర్చులకు మొత్తంగా 12 లక్షలు వసూలు చేసేదట. ఒక్క ట్రిప్‌లో ఆమె సుమారు పది కేజీలకు పైగానే బంగారం అక్రమ రవాణా చేసేదని పోలీసులు గుర్తించారు. అంటే ఒక ట్రిప్పుకు కోటి 20 లక్షల రూపాయలు (10 కిలోల బంగారానికి) కమీషన్ రూపంలో దొరికేది అన్నమాట. ఇంత డబ్బు కోసమే ఆమె ఇలా చేసింది.
రన్యా రావు కన్నడంలో మూడు సినిమాలు నటించింది. కానీ క్రేజ్ రాలేదు. కన్నడంలో తప్ప మరో భాషలో నటించలేదు. ఆమె మూడు సినిమాల హీరోయిన్.