వేసవి సెలవుల్లో విడుదల కానున్న తెలుగు బడా సినిమాల్లో చాలా మార్పులు రానున్నాయి. అనేక సినిమాల విడుదల తేదీలు మారుతాయి. అందులో మొదటగా మార్చుకున్న చిత్రం … ది రాజాసాబ్.
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం దాదాపుగా మూడేళ్ళుగా సాగుతోంది. ఇతర సినిమాలు చేసుకుంటూ టైం కుదిరినప్పుడు ప్రభాస్ ఈ సినిమాకి డేట్స్ ఇస్తూ ఉన్నారు. అందుకే… ఇది అలా నిరంతరంగా సా….గుతోంది. ఏప్రిల్ 10, 2025న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆ డేట్ నుంచి తప్పుకుందని తాజా సమాచారం.
ఇటీవల ప్రభాస్ ఒక షూటింగ్ లో గాయపడ్డారు. దాంతో, కొద్ది రోజులు తీసుకుంటారు. అలాగే ఇతర కారణాలు ఉన్నాయి దాంతో ఏప్రిల్ 10న సినిమా విడుదల కాబోవడం లేదు.
ఈ డేట్ ని విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం లాక్కోవచ్చు. మార్చి 28న పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న “హరి హర వీర మల్లు” విడుదలైతే విజయ్ దేవరకొండ చిత్రం ఏప్రిల్ 10కి మూవ్ అవుతుంది.