కొంతమంది కలిస్తే వెంటనే ఆసక్తి పుట్టుకొస్తుంది. ఇది అలాంటి కాంబినేషనే. దర్శకుడు వేణు ఉడుగుల, నటుడు కమ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ కలిశారు. ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు.
అయితే ఈ సినిమాకు ఇటు తరుణ్ భాస్కర్, అటు వేణు ఉడుగుల ఇద్దరూ దర్శకత్వం వహించడం లేదు. వేణు ఉడుగుల ఈ ప్రాజెక్టుకు నిర్మాత. యారో సినిమాస్ బ్యానర్ తో కలిసి ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నాడు. ఇందులో తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ పోషించబోతున్నాడు.
ఈ ప్రాజెక్టుతో వంశీరెడ్డి దొండపాటి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది. శ్రీనివాస్ గౌడ్ తన భార్య శ్రీలత నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ఓ స్టాంప్ పేపర్ ను చూపించి సినిమాను ప్రత్యేకంగా ప్రకటించారు.
మధ్యతరగతి వ్యక్తుల ప్రేమలు, వాళ్ల జీవన విధానాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. కొత్త నటీనటులు కావాలంటూ కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు.