అదేంటో కోలీవుడ్ లో చాలామంది హీరోయిన్లకు శింబు అంటే ఇష్టం. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లో అతనికి ఎక్కువ క్రేజ్ ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి కీర్తిసురేష్ కూడా చేరింది.
శింబుపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది కీర్తిసురేష్. వీలైతే అతడితో ఓ సినిమాలో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. శింబుతో ఎందుకు నటించాలనుకుంటున్నారనే ప్రశ్నకు కీర్తిసురేష్ దగ్గర మంచి లాజిక్ ఉంది.
కోలీవుడ్ లో శింబు యాక్టింగ్ విలక్షణంగా ఉంటుందట. అతడి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటోంది. శింబుతో ఒక్క సినిమా చేస్తే చాలు, చాలా నేర్చుకోవచ్చని చెబుతోంది కీర్తిసురేష్.
ప్రస్తుతం శింబు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ తో కలిసి “థగ్ లైఫ్” అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఇక శింబు ఎఫైర్ల గురించి చెప్పుకుంటే.. నయనతారతో అతడు చాలా దూరం వెళ్లాడు. వీళ్లిద్దరి లిప్ కిస్ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి అప్పట్లో. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. నయన్ నుంచి విడిపోయిన తర్వాత హన్సికకు కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా మేటర్ చాలా దూరం వెళ్లింది. శింబు-హన్సిక ఒక దశలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత శింబు లైఫ్ లోకి సుభిక్ష అనే హీరోయిన్ వచ్చింది. కొద్దికాలానికే ఆ మేటర్ కూడా క్లోజ్ అయింది.