రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం గురించి ప్రత్యేకంగా పరిచయ కార్యక్రమం అవసరం లేదు. ఈ వివాదంపై తను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని రాజ్ తరుణ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తన దగ్గరున్న ఆధారాలన్నింటినీ కోర్టుకు సమర్పిస్తానని అతడు ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ లావణ్యపై కొన్ని ఆరోపణలు చేశాడు. తను కడుపు చేశాననడానికి సాక్ష్యం ఏంటని ప్రశ్నించాడు, అబార్షన్ కు ఆధారాలెక్కడని అడిగాడు. ఎఫ్ఐఆర్ లో అబార్షన్ మేటర్ ఎందుకు పెట్టలేదని నిలదీశాడు.
ఇలా లావణ్యపై కొన్ని ప్రశ్నలు సంధించాడు రాజ్ తరుణ్. దీంతో లావణ్య వెంటనే స్పందించింది. నిన్న ప్రసాద్ ల్యాబ్ కు రాజ్ తరుణ్ వచ్చినప్పుడు.. బయట హంగామా చేసిన లావణ్.. ఆ వెంటనే రాజ్ తరుణ్ అడిగిన ఆధారాలు తీసుకొని మాదాపూర్ లోని అతడి ఇంటికెళ్లింది. నేరుగా అతడి ఇంటికెళ్లి తలుపుకొట్టింది. ఆధారాలు తెచ్చాను తలుపు తీయమని డిమాండ్ చేసింది.
కానీ రాజ్ తరుణ్ ఇంటి తలుపు తెరుచుకోలేదు. ఆ టైమ్ లో రాజ్ ఇంట్లోనే ఉన్నాడని ఆరోపించింది లావణ్. ఎంతకీ ఇంటి తలుపు తెరుచుకోకపోవడంతో, ఆమె ఇంటి బయట నుంచే రాజ్ తరుణ్ కు కాల్ చేసింది. కానీ ఎవ్వరూ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో చాలా సేపు రాజ్ తరుణ్ ఇంటి బయట ఎదురుచూసిన లావణ్య వెనుదిరిగింది.