ఆగస్ట్ వచ్చింది. ఏ క్షణంలోనైనా “గేమ్ ఛేంజర్” అప్ డేట్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్. “గేమ్ ఛేంజర్” అప్ డేట్ నెలాఖరు వరకు రాదని తేల్చి చెప్పాడు.
శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది “గేమ్ ఛేంజర్” సినిమా. ఈ సినిమా నుంచి “జరగండి” అనే లిరిక్స్ తో కూడిన సాంగ్ ను ఇదివరకే రిలీజ్ చేశారు. అయితే ఆ వెంటనే మరో పాటను విడుదల చేయలేకపోయారు. సినిమా షూటింగ్ లో జాప్యం, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడంతో లిరికల్ వీడియోస్ విడుదల చేయడం ఆపేశారు.
తాజాగా “గేమ్ ఛేంజర్” సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. డిసెంబర్ లో సినిమా వస్తోంది. దీంతో ఆగస్ట్ మొదట్లోనే మరో సాంగ్ వస్తుందని అంతా భావించారు. కానీ దానికి సంబంధించిన అప్ డేట్ నెలాఖరు వరకు రాదని తమన్ ప్రకటించాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. హీరో రామ్ చరణ్ కి సంబంధం లేని సన్నివేశాలు తీస్తున్నారు.