విక్రమ్ అనుకున్నది సాధించాడు. “తంగలాన్”తో వంద కోట్ల హీరోగా అవతరించాడు. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో సాధారణంగా ఆడినప్పటికీ, తమిళ్ లో పెద్ద హిట్టయింది. ఆగస్ట్ 15న రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది.
మాళవిక మోహనన్, పార్వతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళ ఆడియన్స్ ను కట్టిపడేసింది. సినిమా కథాంశం, విజువల్స్ బలం చేకూర్చగా, జివి ప్రకాష్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.
సినిమా సక్సెస్ పై విక్రమ్ పూర్తి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని తనకు తెలుసంటూ పోస్ట్ పెట్టాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఫర్వాలేదన్నట్లుగానే ఆడింది. ఒక వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చింది. కానీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ కాలేదు. అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ప్రశంసలు అందుకొంది.
ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికొస్తే, వంద కోట్లు అనేది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఆట మిగిలే ఉంది. ఎందుకంటే, ఈ సినిమా ఇంకా హిందీలో రిలీజ్ కాలేదు. సెప్టెంబర్ మొదటివారంలో ఉత్తరాదిన “తంగలాన్” రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ హిట్టయితే, ఈ సినిమా వసూళ్లు రెట్టింపు అవ్వడం ఖాయం.