నివేత థామస్ కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ 28 ఏళ్లకే ఆమె తల్లి పాత్రలు చేస్తోంది. “35-చిన్న కథ కాదు” అనే సినిమాలో ఆమె తల్లిగా నటించింది. “35-చిన్న కథ కాదు” సెప్టెంబర్ 6న విడుదల కానున్న నేపథ్యంలో నివేత థామస్ విలేకరులతో మాట్లాడింది.
“ఇందులో నేను కనిపించను. సరస్వతి పాత్రే కనిపిస్తుంది. నేను సరస్వతి అనే హోమ్ మేకర్ పాత్ర పోషించారు. ఇండియన్ సొసైటీలో 22 ఏళ్లకే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని జనరల్ గా అడుగుతారు. నేను హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేయడంలో పెద్ద ప్రాబ్లమ్ లేదు. యాక్టర్ గా అన్ని పాత్రలు చేయాలి. మదర్ గా బాగా చేశాను అనే బదులు సరస్వతి పాత్రని బాగా చేశానని మీరంతా చెబితే సంతోషిస్తాను,” అని చెప్పింది.
” నాకంటూ ఒక పద్దతిని సెట్ చేసుకోవడం నాకు ఇష్టం వుండదు. నివేత ఏ పాత్రనైనా చేయగలదని దర్శకులు నమ్మగలిగితే యాక్టర్ గా అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు,” అని వివరించింది.
అన్నట్లు, నివేత చాలాకాలంగా బరువు సమస్యతో బాధపడుతోంది. ఆమె ఇప్పుడు కూడా లావుగానే కన్పిస్తోంది. అందుకే ఆమెకి అవకాశాలు తగ్గాయి.
కొత్త సినిమాలు ఏవైనా ఒప్పుకున్నారా అని అడిగితే, “ప్రస్తుతానికి ఏదీ సైన్ చేయలేదు. త్వరలోనే చెప్తాను,” అని సమాధానం ఇచ్చింది.