సంతోషంతో కూడిన డైలమా ఇది. ఓవైపు నిర్మాతగా సక్సెస్ అయింది నిహారిక. మరోవైపు ఆమె హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె నిర్మాతగా కొనసాగాలా లేక హీరోయిన్ గా తిరిగి కెరీర్ మొదలుపెట్టాలా అనే డైలమాలో పడింది.
నిర్మాతగా మారి తొలిసారి “కమిటీ కుర్రోళ్లు” సినిమాను నిర్మించింది నిహారిక. ఈ సినిమాకు అన్నీ తానై ప్రచారం చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు స్టార్ ఎట్రాక్షన్ నిహారిక మాత్రమే. అందుకే బాగా కష్టపడింది. ఆమె కష్టానికి ఫలితం దక్కింది. “కమిటీ కుర్రోళ్లు” మంచి విజయం సాధించింది.
ఈ సినిమా విడుదలకు ముందే ఆమె హీరోయిన్ గా కెరీర్ ను రీస్టార్ట్ చేసింది. ఆల్రెడీ మంచు మనోజ్ సినిమాలో నటిస్తోంది. తాజాగా మరో సినిమాకు సైన్ చేసింది.
“కమిటీ కుర్రోళ్లు” సక్సెస్ తో నిహారిక ఇప్పుడు డైలమాలో పడినట్లే అనే మాట వినిపిస్తోంది.
హీరోయిన్ గా కొనసాగాలా, లేక నిర్మాతగా మరో సినిమా నిర్మించాలా అని ఆలోచిస్తోంది. రెండూ చేయొచ్చు కదా అనే అనుమానం రావొచ్చు. కానీ ఈరోజుల్లో రెండూ నిర్వహించడం చాలా కష్టమైన పని. ఒక చోట నిర్మాతగా డబ్బులు పెట్టి, మరో చోటుకు వెళ్లి హీరోయిన్ గా నటించడం అనేది చాలా ఇబ్బందికరం. ఐతే, ఇప్పుడు కెరీర్ పైనే దృష్టి నిలిపింది. డివోర్స్ తీసుకున్నాక ఆమె పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టింది కొంచెం కష్టం అయినా అటు నిర్మాతగానూ , ఇటు హీరోయిన్ గానూ కొనసాగుతుంది అని చెప్పొచ్చు.