
సైడ్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మారి ఆ తర్వాత సోషల్ మీడియా క్వీన్ గా ఎదిగిన తేజస్వి ఇటీవల టీవీ షోలకు, సినిమాలకు, వెబ్ సిరీస్ లకు దూరంగా ఉంది. కొన్నాళ్ళూ దుబాయ్, బ్యాంకాక్ అంటూ విదేశాల టూర్లు చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది.
తేజస్వి మడివాడ తాజాగా “కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్” అనే టీవీషో చేస్తోంది. త్వరలో స్టార్ మాలో రానున్న ఈ కార్యక్రమంలో తేజస్వి కిలాడీ భామగా అలరిస్తుంది అన్నమాట.
“నా జీవితమంతా భయం లేకుండా డేరింగ్ కిలాడీ అమ్మాయిగానే గడిపాను. ఈ షోలో అమ్మాయిల, అబ్బాయిల మధ్య గేమ్స్ మంచిగా ఉంటాయి,” అని పేర్కొంది.
34 ఏళ్ల ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్ తో యాక్టివ్ గా మారింది.