
రాజేంద్రప్రసాద్ ఇటీవల కాలంలో స్టేజ్ ఎక్కితే ఎదో ఎదో మాట్లాడేస్తున్నారు. ఆ మధ్యలో “పుష్ప” సినిమా గురించి సందర్భం లేకుండా మాట్లాడారు. తాజాగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని తప్పుగా సంభోదించారు. సోషల్ మీడియా అంతా రాజేంద్రుడిని ట్రోల్ చేసింది. దాంతో ఒక రోజు తరువాత సారీ చెప్పారు ఆర్ఫీ (రాజేంద్రప్రసాద్).
రాబిన్ హుడ్’ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ వార్నర్ పై చేసిన పలు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా మారాయి.
“నాకు వార్నర్ అంటే ఇష్టం. అతనికి మన సినిమాలు అంటే ఎంతో ఇష్టం. ఆ ఈవెంట్ కి ముందు వార్నర్ తో నేను సరదాగా ఆటపట్టిసూ మాట్లాడాను. అదే మూడులో స్టేజ్ పై మాట్లాడాను. ఉద్దేశ పూర్వకంగా నేను అనలేదు. ఈ విషయంలో ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు తెలుపుతున్నాను,” అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఒక వీడియోలో.
డేవిడ్ వార్నర్ ఈ విషయాన్నీ లైట్ తీసుకున్నాడు కానీ సోషల్ మీడియా మాత్రం పాపం ఆర్ఫీకి నిద్రలేకుండా ట్రోలింగ్ చేసింది.