
హీరోయిన్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోందిప్పుడు. ఇందులో భాగంగా మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయింది. ఆ ముద్దుగుమ్మ పేరు తన్యా రవిచంద్రన్.
తెలుగు-తమిళ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ హీరోయిన్, ఇప్పుడు తన కాబోయే భర్తను పరిచయం చేసింది. సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్ ను ఈమె పెళ్లాడబోతోంది.
“పెన్స్” చిత్రంలో నటిస్తున్నప్పుడు, ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్ ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం తర్వాత కాలంలో ప్రేమగా మారింది. ఇప్పుడు వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తాన్య స్వయంగా ప్రకటించింది.
ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తాన్యా రవిచంద్రన్. అయితే తెలుగులో ఆమె సక్సెస్ కాలేదు. తమిళ్ లో మాత్రం 2 సక్సెస్ లు అందుకుంది. మధ్యలో కొన్ని యాడ్స్ తో పాటు ‘పేపర్ రాకెట్’ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇప్పుడు గౌతమ్ తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది.















