
సమంత కొన్నాళ్లుగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందన్న విషయం మనకు తెలుసు. అధికారికంగా ప్రకటించకపోయినా వాళ్ళ రిలేషన్ గురించి దాపరికం లేదు. వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్న ఈ భామ… సినిమాల విషయంలో మాత్రం పెద్దగా యాక్టివ్ గా లేదు. కుదిరినప్పుడు చేద్దాం అనే మూడ్ లోనే ఉంది.
ఇటీవల ఆమె రాజ్ నిడిమోరుతో కలిసి “శుభం” అనే సినిమా నిర్మించింది. అందులో చిన్న పాత్రలో కనిపించింది. అలాగే, తన నిర్మాణంలో ఆమె నటిగా “మా ఇంటి బంగారం” అనే సినిమా ప్రకటించింది కానీ అది ఇంకా మొదలు కాలేదు. ఆమె ఒప్పుకున్న “రక్త్ బ్రహ్మాండ్” ఆగుతూ..సాగుతూ… వెళ్తోంది. అందుకే ఆమె సినిమాలు, వెబ్ డ్రామాల కెరీర్ నత్త నడకన సాగుతోంది.
ఇక ఆమె రెండో పెళ్ళికి సిద్ధమైంది అనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ ఈ విషయంలో ఆమె మౌనంగా ఉంది.
రాజ్ నిడిమోరు తన భార్యకి దూరం అయ్యారు. విడాకులు కూడా అప్లై చేశారు. ఇంకా కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తి కాలేదు అని సమాచారం. లీగల్ గా సింగిల్ అయ్యాక రాజ్ నిడిమోరు సమంతతో పెళ్లి గురించి ఆలోచిస్తాడని అంటున్నారు.















