
రాజమౌళి కెరీర్ లో బెస్ట్ సినిమా ఏంటని అడిగితే చాలామంది ‘బాహుబలి’ అంటారు. మరికొందరు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చెబుతారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ‘ఛత్రపతి’ సినిమాను కోట్ చేస్తారు. కానీ రాజమౌళికి తన కెరీర్ లో ఇష్టమైన సినిమాలు ఇవేవీ కావు.
రాజమౌళికి తన కెరీర్ లో ఇష్టమైన సినిమా ‘ఈగ’. తాజాగా ‘జూనియర్’ అనే సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన రాజమౌళి ఈ విషయాన్ని బయటపెట్టాడు. జక్కన్న మనసులో ప్రత్యేక స్థానం ‘ఈగ’ సినిమాకే సొంతం.
ఆ టైమ్ లో ‘ఈగ’ అతిపెద్ద ప్రయోగం. నాని-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సుదీప్ విలన్ గా కనిపించాడు. ఓ ఈగను పెట్టి సినిమా తీయడం, దాన్ని సక్సెస్ చేయడం రాజమౌళికే చెల్లింది.
రాజమౌళికి జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా ఈ సినిమాతోనే వచ్చింది. అంతేకాదు, మరిన్ని ప్రయోగాలు చేయొచ్చనే నమ్మకాన్ని కూడా కల్గించింది. అందుకే తనకు ‘ఈగ’ సినిమా అంటే ఇష్టమని తెల్చిచెప్పాడు జక్కన్న.















