తమన్నాకు ఐటెంసాంగ్స్ కొత్త కాదు. గతంలో ఎన్నో సాంగ్స్ చేసింది. తాజాగా స్త్రీ-2లో కూడా చేసింది. అయితే బ్యాక్ టు బ్యాక్ 2 ఐటెంసాంగ్స్ చేయడంపై ఆమె స్పందించింది.
అరణ్మయి-2 సినిమాలో రాశిఖన్నాతో కలిసి తమన్న చేసిన ఐటెంసాంగ్ పెద్ద హిట్టయింది. కావాలా అనే లిరిక్స్ తో సాగిన ఆ పాట వైరల్ అవుతున్న టైమ్ లోనే, స్త్రీ-2 సినిమాలో ఐటెంసాంగ్ ఆఫర్ వచ్చిందట.
వెంటవెంటనే 2 ఐటెంసాంగ్స్ చేస్తే కెరీర్ పై ప్రభావం పడుతుందేమోనని తమన్న భయటపడిందట. అయితే దర్శకుడు ఆ స్పెషల్ సాంగ్ తో పాటు, దాని నేపథ్యాన్ని చెప్పడంతో.. సినిమాలో కీలకమైన పార్ట్ లో తన పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలిసిన తర్వాత వెంటనే ఆ సాంగ్ చేయడానికి అంగీకరించిందంట తమన్న.
ALSO CHECK: Tamannaah Bhatia breaks the mould
చాలా ఏళ్లుగా తను ఇదే విధానాన్ని అనుసరిస్తున్నానని అంటోంది మిల్కీబ్యూటీ. సినిమాలో తన పాత్ర నిడివి ఎంత ఉందనే విషయాన్ని ఆలోచించడం లేదని, తన పాత్ర ప్రేక్షకులగు గుర్తుంటుందా ఉండదా అనే కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నట్టు వెల్లడించింది.
ప్రస్తుతం ఈమె తెలుగులో ఓదెల-2 అనే సినిమా చేస్తోంది.