హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒక్కసారిగా బిజీగా మారింది. ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే… విడుదల అవుతున్న చిత్రాల లిస్ట్ కూడా పెద్దదే. రేపు (సెప్టెంబర్ 5) విజయ్ సరసన నటించిన పెద్ద చిత్రం గోట్ (“GOAT”) విడుదల అవుతోంది.
ఇక వచ్చే నెలలో లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇలా వరుసగా సినిమాలు విడుదల కావడం కేవలం కాకతాళీయమే అని చెప్తోంది.
“ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేసింది కాదు. 2023లో సైన్ చేసిన సినిమాలు కొన్ని ఇప్పుడు వస్తున్నాయి. అలాగే లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ చిత్రాలు ఒకేసారి విడుదల కానుండడం పూర్తిగా కాకతాళీయమే. ఐతే మంచి సినిమాలలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది,” అని అంటోంది ఈ భామ.
ఇక సినిమాలు ఎన్నుకోవడంలో గ్లామర్ రోలా, మరోటా అనేది చూడదంట. “స్క్రిప్ట్ ముఖ్యం. కథ నచ్చితే తర్వాత నా క్యారెక్టర్ గురించి చూస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఇష్టపడతాను,” అని పేర్కొంది.
అలాగే రాబోయే చిత్రాలన్నిటిలోనూ వైవిధ్యమైన పాత్రలు చేసిందట.
“వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘మట్కా’ పిరియడ్ ఫిలిం. ‘మెకానిక్ రాకీ’లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. ‘లక్కీ భాస్కర్’లో తల్లిగా నటించాను. వెంకటేష్ గారితో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాలోపోలీసుగా నటిస్తున్నాను. అన్నీ ప్రత్యేకమే,” అని మీనాక్షి వివరించింది.