నందమూరి బాలకృష్ణ కొడుకు చాలా ఆలస్యంగా హీరో కాబోతున్నాడు. మోక్షజ్ఞ మొదటి చిత్రం ప్రారంభం కానుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసే ఈ సినిమా ఈ నెల 6న ప్రకటిస్తారు. నందమూరి బాలకృష్ణ తన మొదటి సినిమా “తాతమ్మ కల” తన తండ్రి ఎన్టీ రామారావు డైరెక్షన్లో చేశారు.
తన కొడుకు మోక్షజ్ఞ ని కూడా తన డైరెక్షన్లోనే పరిచయం చేయాలనుకున్నారు బాలయ్య. “ఆదిత్య 369’కి సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ పేరుతో తీద్దామనుకున్నారు బాలయ్య. కానీ ఆ ఆలోచన వర్క్ అవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు ఆ బాధ్యతని ‘హను మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మకి అప్పగించారు.
ఈ సినిమాలో బాలయ్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తారట. అలా మోక్షజ్ఞ మొదటి సినిమాకి బాలయ్య ఊతం ఇస్తున్నారు. ఆయన చిన్న కూతురు తేజస్విని ఒక నిర్మాతగా ఉంటారు ఈ సినిమాకి.
కొడుకు సినిమా షూటింగ్ పర్యవేక్షణ, ప్రోగ్రెస్ అంతా దగ్గరుండి చూసుకోవాలని భావిస్తున్నారు బాలయ్య.