ఒక బెట్టింగ్ యాప్ కి సంబంధించిన కేసులో ఇటీవల తమన్నా ఇరుక్కొంది. ఈ కేసులో సాక్షిగా హాజరు కావాలని మహారాష్ట్ర పోలీసులు ఆమెకి సమన్లు జారీ చేశారు. కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు.
ఈ కేసులో పోలీసు అధికారుల ముందు హాజరు కావాల్సి ఉండగా ఆమె హైదరాబాద్ లో “బాక్” సినిమా ప్రొమోషన్లతో బిజీగా గడిపింది.
తమన్న “ఫెయిర్ ప్లే” అనే బెట్టింగ్ యాప్ ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసింది. ఆ యాప్, యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్రాండ్ అంబాసిడర్ లా ప్రమోట్ చేసిన తమన్నకి కూడా సమన్లు వెళ్లాయి.
ఐతే, తమన్న ఇప్పుడు షూటింగ్ లు, సినిమాలతో బిజీగా ఉన్నందున తన లాయర్ ద్వారా జవాబులు పంపింది. తమన్నా మరోసారి ఈ కేసులో హాజరవుతుందేమో.