తెలుగులో కమెడియన్లు హీరోలు కావడం కొత్తేమి కాదు. రాజబాబు కాలం నుంచే ఉంది. ఇటీవల కాలంలో సునీల్, వెన్నెల కిశోర్ వంటి కమెడియన్లు హీరోలుగా సినిమాలు చేశారు. ప్రస్తుతం సుహాస్ కమెడియన్ నుంచి హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ కోవలో ఇప్పుడు మరో తెలుగు కమెడియన్ హీరోల జాబితాలో చేరిపోయాడు.
ఇప్పటికే “బలగం” వంటి సినిమాలతో విజయాలు అందుకున్న ప్రియదర్శి ఇప్పుడు హీరోగా చాలా బిజీ.
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి ఒక మూవీ ఇటీవలే మొదలుపెట్టాడు. తాజాగా హీరో రానా దగ్గుబాటి తన కొత్త బ్యానర్లో ప్రియదర్శి హీరోగా సినిమా నిర్మించనున్నారు.
ప్రియదర్శి హీరోగా నటిస్తూనే ఇతర సినిమాల్లో కమెడియన్ పాత్రలు, హీరోకి ఫ్రెండ్ వేషాలు వేస్తున్నారు. ఐతే, ఇప్పుడు ఇంద్రగంటి, రానా సినిమాల తర్వాత హీరోగానే కంటిన్యూ చెయ్యాలా లేక రెండూ బ్యాలెన్స్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకుంటాడు.