శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న “భారతీయుడు 2” సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇంకా ఈ సినిమా ప్రమోషన్లు మొదలుకాలేదు. వచ్చే నెలలో ఒక భారీ ఈవెంట్ తో స్టార్ట్ చేస్తారట.
మన దగ్గర “ఆడియో” ఈవెంట్ అనే పద్దతి పోయింది. కానీ తమిళ్ లో ఇంకా కొనసాగుతోంది. అందుకే “భారతీయుడు 2” ఆడియో ఈవెంట్ కూడా భారీగా చెయ్యనున్నారట. వచ్చే నెల మూడో వారంలో చెన్నైలో పాటల హంగామా ఉంటుంది.
శంకర్ సినిమాల్లో పాటలు బాగుంటాయి. దాదాపుగా ఆయన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్లు. శంకర్ మొదటిసారిగా అనిరుధ్ తో కలిసి వర్క్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఒక పాట విడుదలైంది. ఐతే, అది పెద్దగా క్లిక్ కాలేదు. ఇప్పుడు అన్నీ పాటలు విడుదల చెయ్యనున్నారు.
“భారతీయుడు 2” సినిమాని లైకా సంస్థ నిర్మిస్తోంది.
Advertisement