“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ చేసిన చిత్రం… “గం..గం..గణేశా”. ఈ సినిమా విడుదలపై ఆ మధ్య అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఇప్పుడు సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిరమించిన ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మే 31న “గం..గం..గణేశా”విడుదల కానుంది.
“గం..గం..గణేశా” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కొండ అంచున నిలబడి ఉన్న హీరో ఆనంద్ గన్ ఫైర్ చేసినప్పుడు ఆ గన్ నుంచి గులాబి రేకలు వస్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు.
మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ మరో హిట్ అందుకుంటాడా?