
దేశవ్యాప్తంగా ఎండల మండిపోతున్నాయి. 40 డిగ్రీలు కామన్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో గుడిసెల్లో ఉండే పేదలు ఎంత ఇబ్బంది పడతారో ఊహించింది తాప్సి. అందుకే తన వంతు సాయంగా కొందరికి కూలర్లు, ఫ్యాన్స్ పంచింది.
ఈ వేసవి నుంచి ఉపశమనం అందించేందుకు ముంబయి మురికివాడల్లో నివశిస్తున్న కొంతమంది పేదలకు టేబుల్ ఫ్యాన్లు, మినీ కూలర్లు అందించింది తాప్సి. భర్త మథియాస్ బోతో కలిసి ఈ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొంది.
తాప్సి చూపించిన ఈ చొరవకు ఓ కంపెనీ సాయం అందించింది.
“మనం తరచుగా ఫ్యాన్ లేదా కూలర్ వంటి ప్రాథమిక సౌకర్యాలను తేలిగ్గా తీసుకుంటాం, కానీ ఈ భరించలేని వేడిలో, చాలా మందికి చిన్న గాలి కూడా ఒక వరంలా అనిపిస్తుంది. ఈ చొరవలో భాగం కావడం నన్ను చాలా కదిలించింది. ఇది ఇవ్వడం గురించి మాత్రమే కాదు, ఇది ప్రజలతో కలిసి నిలబడటం, వారి బాధను అర్థం చేసుకోవడం, వాళ్ల బాధను తగ్గించడానికి మన వంతు ప్రయత్నం చేయడం.”
ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది తాప్సి. త్వరలోనే ‘గాంధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ బ్యూటీ.