
మొన్ననే బ్రేకప్ అయింది, అంతలోనే పెళ్లి గురించి అడిగితే ఎలా.. అందుకే తమన్నాకు కోపం వచ్చింది. అప్పుడే పెళ్లి చేసుకోను అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.
నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ప్రకటించారు. కొన్నాళ్లు ఈ ప్రేమపక్షులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత అభిప్రాయబేధాలొచ్చాయి. హోలీ టైమ్ కు విడిపోయారు.
తామిద్దరం విడిపోయామనే విషయాన్ని తమన్న పరోక్షంగా వెల్లడించింది. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యం అంటూ రకరకాల స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చింది.
ఆ బ్రేకప్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఆమెను పెళ్లెప్పుడు చేసుకుంటారంటూ మీడియా ప్రశ్నించింది. దీంతో తమన్నా ఒకింత అసహనానికి లోనైంది. ఇప్పట్లో పెళ్లి చేసుకోను అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చి ఆ టాపిక్ ను కట్ చేసింది.

ఆమె మళ్లీ ప్రేమలో పడుతుందా లేక పెద్దలు చూసిన సంబంధం చేసుకుంటుందా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. 35 ఏళ్ల తమన్నా మాత్రం తానింకా కొన్నేళ్ల పాటు సినిమాలు చేస్తానని చెప్పుకొస్తోంది.