
‘హిట్-3’ ట్రయిలర్ వచ్చేసింది. అందులో చాగంటి ప్రవచనాల్ని వాడుకున్నారు. తమ ట్రయిలర్ కు, హీరో పాత్రకు తగ్గట్టు చాగంటి కొటేషన్లు అలా సింక్ అయ్యాయని అంతా అనుకుంటున్నారు. కానీ ‘హిట్-3’ కథకు చాగంటికి చాలా పెద్ద కనెక్షన్ ఉందంటున్నాడు నాని.
నిజానికి చాగంటి చెప్పిన ప్రవచనాల్లోంచి కట్ చేసి వాడుకున్న మేటర్ కాదది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చాగంటితో చెప్పించిన మాటలవి. దర్శకుడు శైలేష్, చాగంటిని కలిసి సినిమా ఐడియా మొత్తం వివరిస్తే, అది నచ్చి చాగంటి కోటేశ్వరరావు గారు అలా చెప్పారంట.
ఈ ఆసక్తికర విషయాన్ని నాని స్వయంగా బయటపెట్టాడు. చాగంటి చెప్పిన మాటలకు మరింత లోతైన అర్థం ఉందని, ‘హిట్-3’ సినిమా చూసిన తర్వాత ఆ విషయం అర్థమౌతుందని అంటున్నాడు.
“మనకంటే పదింతలు వైలెన్స్ సినిమాలు తీసే దేశాల్లో మన కంటే క్రైమ్ రేట్ తక్కువగా వుంది. మన బుద్ధి సరిగ్గా వుండాలి. సినిమా అనేది బాధ్యత. మేము ఎంత బాధ్యతగా తీశామో సినిమా చూస్తే మీకే అర్ధమౌతుంది,” అని సినిమాలోని హింసాత్మక సన్నివేశాలను సమర్ధించుకున్నారు నాని.
ALSO READ: HIT 3 Trailer: Nani appears in his violent avatar
“సినిమాలో మంచి మెసేజ్ కూడా వుంది. ధర్మం కోసం నిలబడ్డ మనిషి ఎంత దూరం వెళ్ళాడనేది ఇందులో చూస్తారు. చాలా డిఫరెంట్ ఫిల్మ్. చాలా యూనిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది,” అని శైలేష్ అన్నారు.