
ఇలా ఆలోచించేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. కళ్ల ముందు కోట్ల రూపాయలు కనిపిస్తుంటే, అమాంతం లాగేసుకొని బ్యాగులో వేసుకోవాలని చూస్తారు. కానీ హీరోయిన్ సమంత మాత్రం ఆ పని చేయనంటోంది.
తనకు డబ్బు కంటే ప్రేక్షకులు, అభిమానులు ముఖ్యం అంటోంది. అందుకే కోట్ల రూపాయల డీల్స్ ను కూడా కాదనుకున్నానని, అలా ఇప్పటివరకు 15 యాడ్స్ వదులుకున్నట్టు వెల్లడించింది.
ఎన్నో బ్రాండ్స్ తన వద్దకు వస్తున్నాయని, కానీ ఉత్పత్తులకు ప్రచారం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాని తెలిపింది సమంత. తన వద్దకు వచ్చిన ప్రొడక్టుల్ని ముందుగా తనకు తెలిసిన ముగ్గురు వైద్యులతో పరీక్షలు చేయిస్తుందంట సమంత.
వైద్య పరీక్షల తర్వాత అవి ప్రజలకు హాని కలిగించవని నిర్థారించుకున్న తర్వాతే ఆ యాడ్స్ లో నటిస్తోందంట. అలా తన పరీక్షల్లో నెగ్గని 15 బ్రాండ్స్ ను వదులుకున్నట్టు తెలిపింది. ఆ 15 బ్రాండ్స్ విలువ దాదాపు 15 కోట్ల రూపాయలు. అంటే, 15 కోట్ల రూపాయల ఆఫర్లను సమంత వదులుకుందన్నమాట.