
హీరో రాజ్ తరుణ్ ఏమైపోయాడు అని మనం ఇటీవలే అనుకున్నాం. గతేడాది తన మాజీ ప్రియురాలు లావణ్య వేసిన కేసు, ఆ వివాదంతో చాన్నాళ్లు వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత విడుదలైన సినిమాలు ఫట్ అనడంతో ఐదు నెలలు మాయం అయ్యాడు. దాంతో, రాజ్ తరుణ్ ఏమైపోయాడు, ఎక్కడున్నాడు అని తెలుగుసినిమా.కామ్ వార్త రాసింది.
నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఈ రోజు మీడియా ముందుకొచ్చాడు. మరో కొత్త సినిమాతో వచ్చాడు. రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’ అనే సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఈ రోజు డైరెక్టర్ మారుతి ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేశారు. ఇలా కొంత గ్యాప్ తర్వాత మీడియా ముందుకి కొత్త సినిమా ప్రెస్ మీట్ తో ప్రత్యక్షమయ్యాడు.
“ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. మా డైరెక్టర్ కష్టం ఆయన విజన్ అట్లా ఉంది. నిర్మాతలు ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. రాశి అమేజింగ్ గా నటించింది త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామ”ని రాజ్ తరుణ్ అన్నాడు.
లావణ్య ఇప్పటికే తప్పుడు కేసు పెట్టాను అన్నట్లుగా మాట్లాడింది. కానీ రాజ్ తరుణ్ కెరీర్ రైట్ ట్రాక్ లోకి వస్తుందా అన్నది చూడాలి.