నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ హీరోగా సినిమా అని గత సెప్టెంబర్లో హడావిడిగా ప్రకటించారు. సినిమా షూటింగ్ మొదలు కానుంది అని, హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ అని మరి కొంతకాలం హడావుడి సాగింది. కానీ సడెన్ గా సినిమా ఆగిపోయింది. దాంతో, దర్శకుడు ప్రశాంత్ వర్మ షాక్ తిన్నారు.
మొత్తానికి ఇరువైపులా మళ్ళీ ఏవో చర్చలు జరిగాయని, షూటింగ్ కి త్వరలోనే వెళ్తామని మీడియా లీకులు వచ్చాయి. నిర్మాణ సంస్థ కూడా సినిమా ఆగిపోయింది అన్న వార్తల్లో నిజం లేదని ఇటీవలే ప్రకటించింది.
కొత్త ఏడాది వచ్చింది. సంక్రాంతి సీజన్ కూడా వచ్చింది. కానీ మోక్షు-ప్రశాంత్ వర్మ సినిమా అప్ డేట్ రావట్లేదు. ఇంతకీ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది?
ప్రశాంత్ వర్మ ఆ మధ్య చాలా హడావిడి చేశాడు. “హనుమాన్” సినిమా భారీ హిట్ కావడంతో ఆ జోష్ లో చాలా మాట్లాడాడు. ఎన్నో సినిమాలు ప్రకటించాడు. కానీ ఒక్కటీ ముందుకు సాగలేదు. దానికి తోడు మోక్షజ్ఞ సినిమా ఆగింది అన్న వార్తలు బయటికి రావడంతో ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా డీలాపడ్డాడు. ఇప్పుడు ఈ సినిమా సెట్ పైకి వెళ్తే కానీ అతని పరువు నిలబడదు.